MLC Jeevan Reddy: జగిత్యాల, నవంబర్ 14 (మన బలగం): ఎందరో మరేందరికో మోడల్‌గా నిలుస్తారు. జగిత్యాలకు చెందిన ఓ బాలుడికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోల్ మోడల్‌గా నిలిచాడు. పిల్లలు టీచర్లుగా మారి టీచర్లు, టీచర్లు పిల్లలుగా మారి జాతీయ స్థాయిలో జరుపుకొనే జాతీయ బాలల దినోత్సవాన ఓ బాలుడికి జీవన్ రెడ్డి ఆదర్శంగా మారి మోడల్‌గా నిలిచిన సంఘటన ఇది. జగిత్యాల పట్టణానికి చెందిన ముంజాల రఘువీర్ గౌడ్ స్వతహాగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు, జీవన్ రెడ్డి వీరాభిమాని. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ వేషధారణలతో ప్రతి పాఠశాలలో విద్యార్థులు తమ ప్రతిభను కనబరుస్తారు. ఈ నేపథ్యంలో రఘువీర్ గౌడ్ ఆలోచనల్లో జీవన్ రెడ్డి మేదిలారు. వెంటనే తన కుమారుడు వేదన్ష్కు జీవన్ రెడ్డి వేషధారణ వేయించి స్కూల్లో ప్రదర్శనకు వెళ్లే ముందు జీవన్ రెడ్డిని కలిశారు. ఇంకేముంది ఆ చిన్నారి జీవన్‌ను సీనియర్ జీవన్ రెడ్డి ఆసాంతం పరీక్షించి ఆనందించారు. ఈ విషయం సోషల్ మీడియాకు చేరి వైరల్ కాగా ఆ చిన్నారికి జీవన్ రోల్ మోడల్ అయ్యాడనే చర్చ జరుగుతోంది.