Job mela: ధర్మారం, నవంబర్ 15 (మన బలగం): పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ఆధ్వర్యంలో సమరథనం ట్రస్ట్ ఫర్ ది డిసబుల్ద్ అండ్ ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ హైదరాబాద్, తెలంగాణ వారి సహకారంతో ఈ నెల16వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని నిరుద్యుగ యువతి, యువకుల కోసం, శారీరక, మానసిక దివ్యాంగుల కోసం డేటా ఎంట్రీ, బి.పి.ఓ, రిటైల్, ఈ కామర్స్, టూరిజం అండ్ హాస్పిటలిటి, హోటల్ మేనేజ్మెంట్, ఆటోమోటివ్, వైద్య (ఫారమసీ), ఎలక్ట్రికల్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మెడ్‌ప్లస్, ఆక్సిస్ బ్యాంక్, పారడైజ్ బ్యూటీ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. శనివారం స్థానిక స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు, 10వ తరగతి, ఇంటర్ జనరల్ లేదా ఒకేషనల్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఏఎన్ఎం, జీఎన్ఎమ్, బీఎస్సీ నర్సింగ్, అగ్రికల్చరల్ మొదలగు ఇతరాత్ర చదువులు పూర్తి చేసిన నిరుద్యోగులు అర్హులు. జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థులు బయోడేటా ఫామ్ లేదా రెస్యూమ్ 5 కాపీలు, ఆధార్ కార్డ్ జీరాక్స్, 5 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు,10వ తరగతి మెమో జిరాక్స్, ఇంటర్ లేదా డిగ్రీ మెమో జిరాక్సు కాపీలు, వికలాంగులు అయినచో వారి యొక్క సదరం సర్టిఫికెట్లతో హాజరు కావాలి. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులు అందరు వినియోగించుకోవాలని, పూర్తి వివరాలకు 98493 60370, 90000 49345 సెల్ నెంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.