Kadarl Ravindra retirement felicitation English teacher Nirmal: నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాషాభివృద్ధికి విశేషమైన కృషి చేసిన ఆంగ్లభాష ఉపాధ్యాయులు, ఆంగ్ల భాష టీచర్స్ అసోసియేషన్ ఎల్టా కడార్ల రవీంద్ర సేవలు చిరస్మరణీయమని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. ఆదివారం దిలావర్‌పూర్ మండలం బన్సపల్లి ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కడార్ల రవీంద్ర పదవి విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంగ్ల భాష ఉపాధ్యాయులకు రవీంద్ర రోల్ మోడల్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉపాధ్యాయులు, మిత్రులు, బంధువులు పెద్ద ఎత్తున సన్మానించారు. ఆంగ్ల భాష టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్ రావు రమణారెడ్డి శ్రీనివాస్ రామచందర్‌తో పాటు ఎల్టా.. నాయకులు వేణుగోపాల్, రతన్ కుమార్, డేవిడ్ గంగన్న, డేవిడ్ వివేకానంద, భూమన్న యాదవ్ పాల్గొన్నారు.