MeeSeva Operators Union Nirmal district new committee: తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ యూనియన్ నిర్మల్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా షేక్ కైసర్ ఎన్నికైనట్లు టీఎంవోఏ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల జీవన్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం మారుతి హోటల్‌లో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆయన వెల్లడించారు. అధ్యక్షులుగా షేక్ కైసర్, జనరల్ సెక్రెటరీగా మలెపు నవీన్ కుమార్, ఉపాధ్యక్షులుగా కాల్వ అశోక్, అజయ్ జాయింట్ సెక్రెటరీగా షేరు జితేశ్ చంద్ర, సోషల్ మీడియా కన్వీనర్‌గా విశాల్‌ను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర కార్యవర్గం ఉపాధ్యక్షులుగా రాచ విజేత అశ్విన్, జాయింట్ సెక్రెటరీగా సాయి శాంతన్ రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా సింగం శివప్రసాద్, బిట్లింగ్ శ్రీనివాస్‌లను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బత్తుల జీవన్ ప్రసాద్, ఉపాధ్యక్షులు వాసం భూమేశ్వర్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, స్టేట్ జాయింట్ సెక్రెటరీ మొహమ్మద్ నాసిర్ హైమద్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సాగర్ బాబు, చిలుముల వేణు తదితరులు పాల్గొన్నారు.