Kalvakuntla kavita
Kalvakuntla kavita

Kalvakuntla kavita: కస్తూర్బా పాఠశాలను సందర్శించిన కల్వకుంట్ల కవిత

Kalvakuntla kavita: సారంగాపూర్, డిసెంబర్ 15 (మన బలగం): జగిత్యాల జిల్లాలోని కస్తూర్బా పాఠశాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెంచిన డైట్ చార్జీలను కస్తూర్బా పాఠశాలలకు వర్తింపజేయకపోవడం బాధాకరమన్నారు. కస్తూర్బా పాఠశాలలకు పెంచిన డైట్ చార్జీలను వర్తింపజేయాలని డిమాండ్ చేసారు. రాష్ట్రవ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలున్నాయని, విద్యార్థులు అందరికీ పౌష్టికాహారం అందించాలని కోరారు. సర్వ శిక్ష అభియాన్ కింద పాఠశాలల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసారు. ఉపాధ్యాయులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేసారు. కేసీఆర్ మొదలుపెట్టిన గురుకుల పాఠశాలల లక్ష్యాన్ని దెబ్బతీయకూడదన్నారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ప్రభుత్వం రాజీ పడకూడదన్నా్రు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *