Beggars Free City: మధ్యప్రదేశ్ రాష్ర్టంలోని ఇండోర్ జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి జిల్లాలో భిక్షగాళ్లకు డబ్బులు దానం చేస్తే పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. కొత్త నిబంధన వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. బెగ్గర్ ఫ్రీసిటీ కసం అధికారులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. జనవరి 1 నుంచి ఎవరైనా యాచకులకు డబ్బులు ఇస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. భిక్షాటన పేరుతో దోపిడీ ముఠాలు చెలరేగిపోతుండడంతో అధికారులు ఈనిర్ణయం తీసుకున్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికరత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బిచ్చగాళ్ల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు పైలెట్ ప్రాజెక్ట్ కోసం 10 నగరాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అందులో ఇండోర్ సిటీ సైతం ఉంది.