road accident: ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 28 (మన బలగం): ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చింతల్తానా గ్రామానికి చెందిన నరేశ్ (36) తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ట్రాక్టర్‌కు ఉన్న కేజీ వీల్స్‌కు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అదే దారిలో వెళ్తున్న సిరిసిల్ల డీస్పీ చంద్రశేఖర్ రెడ్డి సంఘటన స్థలంలో ఆగి మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించారు. ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.