Distribution of blankets
Distribution of blankets

Distribution of blankets: ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలి: జిల్లా ఎస్పీ జానకి షర్మిల

Distribution of blankets: నిర్మల్, జనవరి 2 (మన బలగం): సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో గల శాంతినికేతన్ మానసిక వికలాంగుల కేంద్రంలో నూతన సంవత్సరం, చలి కాలాన్ని పురస్కరించుకుని వికలాంగులు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మీ అందరిని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో శాంతినికేతన్ డాక్టర్ పన్నెల జనార్ధన్, డాక్టర్ కృష్ణరాజు, డైరెక్టర్ శనిగారపు చిన్నయ్య, టీచర్ రేఖ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *