Nirmal Festival: నిర్మల్, జనవరి 2 (మన బలగం): నిర్మల్ ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 5, 6, 7 తేదీలలో నిర్వహించనున్న నిర్మల్ ఉత్సవాల కార్యక్రమం ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, నిర్మల్ ఉత్సవాలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. స్టేజి, స్టాల్స్, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. స్టాళ్లు, స్టేజి ఏర్పాటు చేయబోయే ప్రదేశాలను పరిశీలించారు. వాహనాల పార్కింగ్‌కు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీవైఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.