Teachers appreciate students for regular attendance in Khanaapur: చదువుతోనే సమాజంలో ప్రతివారికి విలువతోపాటు గుర్తింపు లభిస్తుందని, ఎంత కష్టమైనా ఇష్టంతో చదవాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోనగిరి నరేందర్ రావు అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బడి నడిచిన రోజులలో క్రమం తప్పకుండా హాజరైన విద్యార్థులను గురువారం పాఠశాలలో అభినందించారు. వారంపాటు భారీ వర్షాలు పడిన క్రమం తప్పకుండా వచ్చి స్ఫూర్తిదాయకంగా నిల్చిన విద్యార్థులు ఐనవేని నిహారిక, మొహమ్మద్ ఉమేజ ఫాతిమా, భైరవేణి నవిగ్న, జంజీరాల నందిత, గుండవేణి ప్రజ్ఞస్య, మాలావత్ శ్రీ చందన, చెట్‌పెల్లి వర్షిత్, మొహమ్మద్ రహీమ్, జోగు గుర్నాథ్, చెల్ల వంశీ, పానుగంటి నివేదిత, గుండాల వందన, చిలుకూరి రిషిత, చంద్రకాంత్, సాయిశ్రీలకు పెన్నులు, నోట్ పుస్తకాలు ప్రోత్సాహకంగా అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుర్ర శేఖర్, వెన్నం అంజయ్య, షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.