Pre-Sankranti celebrations: మెట్పల్లి, జనవరి 5 (మన బలగం): ఆర్యవైశ్య సంఘం మెట్పల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబురాలు ఆదివారం వాసవి గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు డ్రాయింగ్ పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు, పతంగులు ఎగురవేయడం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గెలిచిన విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సింగిల్, గ్రూప్ సంక్రాంతి రిలేటివ్ డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మైలారపు లింబాద్రి, ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కోట సుమన్, మెట్పల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు ఆర్యవైశ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.