Accreditation Committee
Accreditation Committee

Accreditation Committee: అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడిగా యూసుఫ్ తొలగింపు: ఉత్తర్వులు జారీ చేసిన ఐ అండ్ పీఆర్ కమిషనర్

Accreditation Committee: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, జనవరి 26 (మన బలగం): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నుంచి సిఫార్సు చేయబడిన, రాజన్న సిరిసిల్ల జిల్లా అక్రిడిటేషన్ కమిటీ (2022-2024) సభ్యుడిగా ఉన్న యూసఫ్ అలియాస్ యూసూబ్‌ను అక్రిడిటేషన్ కమిటీ సభ్యునిగా తొలగిస్తూ ఐ అండ్ పీఆర్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడిగా ఉన్న యూసఫ్ అలియాస్ యూసూబ్‌పై పలు ఆరోపణలు, ఫిర్యాదులు, కేసులు నమోదుకాగా, పోలీసులు విచారణ చేపట్టి పూర్తి వివరాలు ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు పంపించారు. దీంతో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడిగా ఉన్న యూసఫ్ అలియాస్ యూసూబ్‌ను తొలగిస్తూ ఐ అండ్ పీఆర్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *