కాడి రకం 10,891, గోల రకం9,571
Turmeric crop prices: ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 17 (మన బలగం): పసుపు పంట ధర రోజు రోజుకూ తగ్గుముఖం పడుతుంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పలువురు రైతులు యార్డుకు పసుపు పంట తిసుకొచ్చారు. కాడి గరిష్ఠం రూ.10,881, కనిష్ఠం రూ.5,001 వేలు, గోల గరిష్ఠం రూ.9,571, కనిష్ఠం రూ.5,026, చుర కొమ్ము గరిష్ఠం రూ.9261, కనిష్ఠం రూ.6వేలు పలికాయి. గత వారంతో పోలిస్తే దాదాపు 2 వేల వరకు ధరలు తగ్గుముఖం పట్టినట్టు రైతులు తెలిపారు.
