Talent Awards: నిర్మల్ పట్టణంలోని ప్రాఫిట్ షూ కంపెనీ షోరూంలో పేద విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాలలోని ప్రతి జిల్లా స్థాయిలో 2024 -2025 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతి పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులను ప్రోత్సహించిన ప్రధాన ఉపాధ్యాయులను గుర్తించి వారిని ఆత్మీయంగా సత్కరించి ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి జి.నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మెరిసిన ఈ విద్యాకుసుమాలు సమాజంలో ప్రతి ఒక్కరికి ఆదర్శం అని, విద్య ద్వారానే సమాజ స్థితిని, గతిని మార్చవచ్చని తెలిపారు. ప్రాఫిట్ షూ కంపెని అధినేత బి.ఎస్ కోటేశ్వరరావును అభినందించారు. నిర్మల్ జిల్లాలో ఎంతో చక్కని ప్రతిభకు ప్రోత్సాహం అందించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను అభినందించారు.
వారు మాట్లాడుతూ ప్రాఫిట్ షూ కంపెనీ సమాజ సేవలో ప్రతి సందర్భంలో ముందుంటుందని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సేవ చేసిందని తెలిపారు. బిఎస్ కోటేశ్వరరావు బాలల హక్కుల పరిరక్షణ కోసం, ఆపదలో ఉన్న భారత రక్షణ కొరకు విజయవాడ వేదికగా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ద్వారా చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానం విద్యార్థిని సిరికొండ అక్షయ 540/600 jumerathpet GHS SCHOOL, 2వ స్థానంలో నిలిచిన. ZPHS MODEL SCHOOL MANJULA PUR విద్యార్థి 539/600 చంద్ర సిద్దార్థ నిర్మల్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆత్మీయంగా సత్కరించి జ్ఞాపిక, కళాశాల బ్యాగు, ఒక జత షూ, ఓ విజేత ఆత్మకథ పుస్తకం, నోట్ బుక్స్ ఇతర విద్యా ప్రోత్సాహ బహుమతులు అందించారు. తదనంతరం విద్యార్థులను ప్రోత్సహించి ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను గుర్తించి వారిని అభినందించి ఆత్మీయంగా సత్కరించి వారికి ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్తులు వారి తల్లిదండ్రులు, ప్రాఫిట్ షూ కంపెనీ ఏరియా మేనేజర్ అంబాజీ, మేనేజర్ సాయి కృష్ణ, రవికిరణ్, సిబ్బంది చరణ్, మహేష్, శివకుమార్ పాల్గొన్నారు.
