Albendazole Tablet Distribution in Nirmal District
Albendazole Tablet Distribution in Nirmal District

Albendazole Tablet Distribution in Nirmal District: విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

Albendazole Tablet Distribution in Nirmal District: జాతీయ నులి పురుగు నిర్మూలన దినోత్సవ సందర్భంగా సోమవారం నిర్మల్ రూరల్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల వెంకటాపూర్‌లోని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖ అధికారి ముడారపు పరమేశ్వర్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు. 19 సంవత్సరాల లోపు గల పిల్లలకు మాత్రలు అందజేసినట్లు చెప్పారు. ఈ రోజు మాత్రలు వేయించుకోని విద్యార్థులకు 18వ తేదీన వేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు తప్పనిసరిగా మాత్రలు వేయాలని, దీనిద్వారా వారి ఆరోగ్యానికి రక్షణ ఏర్పడుతుందని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *