అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం
PRABHAS: స్టార్ హీరో ప్రభాస్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సీపల్లి రమేశ్ ఈ నెల 22వ తేదీన మృతిచెందాడు. అభిమానుల ద్వారా విషయం తెలుసుకున్న హీరో ప్రభాస్ బాధిత కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించారు. తన పీఏ ద్వారా ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబానికి చేరవేశాడు. పీఏ రామకృష్ణ శనివారం కరీంనగర్‌లోని రమేశ్ కుటుంబాన్ని పరామర్శించారు. హీరో ప్రభాస్ పంపిన ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటామని రామకృష్ణ బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు.