Telangana state formation celebrations: తెలంగాణ భద్రత మన చేతుల్లోనే

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నిర్మల్ జిల్లా ఎస్పి జానకి షర్మిల

Telangana state formation celebrations: దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ పదేళ్ల పండుగను ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషమని, ప్రత్యేక తెలంగాణ భద్రత, బాధ్యత పోలీసు శాఖ చేతిలో ఉందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు.ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని క్యాంపు కార్యాలయంలో, జిల్లా పోలీస్ కార్యాలయంలో మరియు సాయుధ ధళ కార్యాలయంలో గౌరవ వందనం స్వీకరించిన తరువాత జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల జాతీయ జెండా ఆవిష్కరించారు.అనంతరం జిల్లా ఎస్పి జిల్లా పోలీసులకు, ప్రజలకు, అధికారులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ…ఎంతో మంది అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుటకు పోలీస్ శాఖ పై గురుతర బాధ్యత ఉందని అందుకు పోలీస్ సిబ్బంది మరింత బాధ్యతతో పని చేయాలనీ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ధనిక, పేద తేడాలు లేకుండా ఒకే రకమైన సేవలు అందించాలని, ప్రతి ఒక్క పోలీస్ శాఖ సిబ్బంది బాధ్యతతో పని చేసి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకరావాలని కోరారు.

Nirmal
Cultural Event

ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేసిన చిన్నారులను ఎస్పీ అభినందించారు.
ఈ సమావేశంలో భైంసా ఎఎస్పీ కాంతిలాల్ పాటిల్, నిర్మల్ డిఎస్పీ గంగా రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ , నిర్మల్ రూరల్ సీఐ, అర్ఐలు , ఆర్ ఎస్ ఐ లు, ఎస్ఐలు, ఎస్బీ, కార్యాలయ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *