Darling
Darling

Darling: ‘డార్లింగ్’ కాన్సెప్ట్ అదిరిపోయింది: నాని

Darling: ప్రియదర్శి, నభా నటేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. ఈ మూవీకి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె.నిరంజన్ రెడ్డి, చైతన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎంటర్‌టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేయనుంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్‌‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘నెక్స్ట్ మంత్ ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నాం. దర్శి వలన కొంచెం ముందుగానే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. డార్లింగ్ టీజర్, ట్రైలర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. ఇటీవల కాలంలో యాక్షన్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. కామెడీ, లవ్ స్టొరీ మూవీస్‌ను మిస్ అవుతున్నాం. లాస్ట్ ఇయర్ లవ్ స్టోరీ, ఎమోషన్ కలిపి ‘హాయ్ నాన్న’తో మీ ముందుకు వచ్చాను. ఈ ఏడాది దర్శి లవ్ స్టోరీ, కామెడీ కలిపి ‘డార్లింగ్‌’తో రాబోతున్నారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి. ఏదో ఒక వేరియషన్ మాత్రమే కాకుండా కామెడీ, ఎమోషన్, లవ్, యాక్షన్ ఇలా అన్ని రకాల మూవీస్ రావాలి. దర్శి లాంటి ట్యాలెంటెడ్ యాక్టర్ అలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకోవడం ఎంతో ఆనందంగా అనిపించింది. స్ల్పిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్ చాలా ఎంటర్‌టైనింగ్‌ ఉంటుంది. లేడి అపరిచితుడిని చూస్తాం.

ఇలాంటి కాన్సెప్ట్‌తో ఎంత లాఫ్టర్ జనరేట్ చేయొచ్చో చెప్పలేం. ట్రైలర్ చూస్తుంటే పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్నట్లు తెలుస్తుంది. హనుమాన్ మూవీ అంత సక్సెస్ డార్లింగ్ మూవీ కావాలని కోరుకుంటున్నాను. వివేక్ మ్యూజిక్ అంటే నాకు ఎంతో ఇష్టం. డార్లింగ్‌తో మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని కోరుకుంటున్నారు. డైరెక్టర్ అశ్విన్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. నభా ‘డార్లింగ్’ మూవీతో కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నారు. దర్శి అంటే నాకు ఎంతో ఇష్టం. హాయ్ నాన్న గోవా షూటింగ్‌లో ఓ రోజు బయటికి వెళ్లి సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. తన నటన, పాత్రలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ డకేడ్‌లోనే నాకు మోస్ట్ ఫేవరేట్ ఫిల్మ్ బలగం సినిమా. బలగం మూవీ హీరో ఫ్యాన్‌గా ఈ ఈవెంట్‌కు రావడం గర్వంగా ఫీలవుతున్నా. డార్లింగ్ కూడా దర్శి కెరీర్‌లో ఒక మైల్ స్టోన్ కావాలని వేడుకుంటున్నారు. జూలై 19న రిలీజ్ అయ్యే సినిమా‌ను అందరూ కచ్చింగా చూడాలని కోరుతున్నారు. నా వాల్ పోస్టర్ బ్యానర్ నెక్స్ట్ సినిమాలో దర్శినే హీరోగా ఉండనున్నారు. జగదీశ్ ఈ మూవీని డైరెక్టర్ చేస్తారు. మిగతా వివరాలు త్వరలోనే చెబుతాను. డార్లింగ్ టీంకు శుభాకాంక్షలు’ అని తెలిపారు.

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు చిరంజీవిని చూసి యాక్టర్ కావాలని ఇన్స్పిరేషన్ ఉండేది. ఇప్పుడు నాని అన్ననే నా ఇన్స్పిరేషన్. ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి రావాలనుకునే ఇప్పటి జనరేషన్‌కు ఆయన ఒక ఎగ్జామ్‌పుల్. కల్కి సినిమాలా ఆలోచిస్తే నాని రథం నడిపే కృష్ణుడైతే ఆ దారిలో వెళ్లే అర్జునుడిలా, నాని అన్నను ఫాలో అవుతున్నాను. వేడుకకు గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చిన శివలెంక కృష్ణప్రసాద్‌తోపాటు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. డార్లింగ్‌తో తెలుగు సినిమా అశ్విన్‌ను అక్కున చేర్చుకుంటుంది. నిరంజన్, చైతన్య ఈ కథని నమ్మారు. వారితో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నా.
డైరెక్టర్ అశ్విన్ రామ్ మాట్లాడుతూ.. కొత్త దర్శకులకు కొత్త కథలు రాసుకునే స్ఫూర్తిని ఇచ్చే హీరో నాని. డార్లింగ్ నాకు ఎంతో ప్రత్యేకమైన సినిమా. డార్లింగ్‌లో నభా కొత్తగా కనిపిస్తారు. దర్శి సపోర్ట్ ఎప్పటికీ మరిచిపోలేను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *