Siricilla Collector
Siricilla Collector

Siricilla Collector: అర్హుల గుర్తింపు పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

  • రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు నిరంతర ప్రక్రియ
  • పారదర్శకంగా లబ్ధిదారుల గుర్తింపు
  • జిల్లాలో మొదలైన ప్రజా పాలన గ్రామ, వార్డు సభలు

Siricilla Collector: మనబలగం, సిరిసిల్ల జిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ కోసం అర్హుల గుర్తింపు పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు సభలకు మంగళవారం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో మంగళవారం పథకాల కోసం సభలు నిర్వహించారు. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటలో నిర్వహించిన గ్రామ సభకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై పరిశీలించారు. అర్హుల గుర్తింపు కోసం చేపట్టిన సభలో కూర్చుని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ కోసం జిల్లాలోని ఆయా గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో అర్హుల గుర్తింపు సభలు నిర్వహిస్తున్నామని వివరించారు. అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందుతాయని వెల్లడించారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు అనేవి నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకొని వారు సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. రేషన్ కార్డుల్లో కుటుంబసభ్యుల నమోదుకు అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఆయా పథకాలు అర్హులైన వారికి అందుతాయని, ఎంపిక పారదర్శకంగా చేపడుతామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఉదయం 9 గంటలకు మొదలు
జిల్లాలోని రుద్రంగి, బోయినపల్లి, చందుర్తి, కోనరావుపేట, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, ఇల్లంతకుంట, గంభీరావుపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట తదితర మండలాల్లో 75 గ్రామాలు, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 4, 5, 6, 8, 9, 16, 17, 18, 19, 28 వార్డుల్లో, వేములవాడ మున్సిపల్ పరిధిలోని 1, 2, 8, 12, 18, 21, 22, 25 వార్డుల్లో మొదటిరోజు గ్రామ, వార్డు సభలు నిర్వహించారు. ఉదయం 9.00 గంటల నుంచి 12.00 గంట వరకు అలాగే మధ్యాహ్నం 01.00 గంటల నుంచి 04.00 గంటల దాకా సభలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *