CPI
CPI

CPI: సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌‌కు అభినందనలు

CPI: సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన పంజాల శ్రీనివాస్‌ను శనివారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వుట్కూరి నరేందర్ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తితో ఏఐఎస్ఎఫ్‌లో చేరి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం విద్యారంగంలో మార్పుల కోసం అనేక పోరాటాలు శ్రీనివాస్ చేశాడని, ఏఐవైఎఫ్ నాయకుడిగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, వారి సమస్యలపై కూడా ఎన్నో ఉద్యమాలు నిర్మించాడని, అనంతరం సీపీఐలో జిల్లా కౌన్సిల్ సభ్యులుగా, కార్యవర్గ సభ్యులుగా, కరీంనగర్ నగర కార్యదర్శిగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసి నేడు జిల్లా కార్యదర్శి స్థాయికి అతి చిన్న వయస్సులో ఎదగడం అభినందనీయమని, భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువై వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *