Converts with lovejihad: ధర్మపురి, డిసెంబర్ 30 (మన బలగం): దక్షిణ అస్సాం ప్రాంత అఖిల భారతీయ సహసేవ ప్రముఖ్ సూపర్ణ దేవి సోమవారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సూపర్ణ దేవి మాట్లాడుతూ దేశంలో అలాగే ఈశాన్య రాష్ట్రాలలో లవ్ జిహాద్‌లతో మతమార్పిడులతో హిందూ మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇలాంటి దాడులకు హిందువులమంతా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని చెప్పారు. అందరూ కలిసికట్టుగా పోరాడే బాధ్యత మనందరిలోనూ ఉన్నదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న లైంగికదాడులను తీవ్రంగా ఖండించారు. వారి వెంట రాష్ట్ర సేవా సమితి తెలంగాణ ప్రాంత సంపర్క్ ప్రముఖ్ సింధు దిది, జిల్లా సంపర్క్ ప్రముఖ్ వీరభత్తిని కవోస్ట, బీజేపీ జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ మహిళ ప్రముఖ్ సంఘీ మంజుల, బీజేవైఎం అధ్యక్షులు గాజు భాస్కర్ పాల్గొన్నారు.