Ad hoc committee: నిర్మల్, జనవరి 12 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘభనంలో నిర్వహించే సమావేశంలో ఆదివాసి నాయకసోడ్ ఉద్యోగ సంఘం నిర్మల్ జిల్లా అడ్‌హక్ కమిటీని నూతనంగా ఎన్నుకున్నారు. ఆదివాసి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కే.భీమేశ్వర్, సెక్రటరీగా ఏ.సతీశ్, ఉపాధ్యక్షులుగా ఎస్.శివశంకర్, కార్యదర్శులుగా ఎస్.బాపయ్య, ఎం.రవి కుమార్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులు సంఘ భవన నిర్మాణానికి, ఉద్యోగుల ఆర్థిక అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో ఆదివాసి ఉద్యోగులతో పాటు జనరల్ సంఘం బాడీ సభ్యులు పాల్గొన్నారు.