Student Election: పాఠశాల స్థాయి నుంచి ప్రతి విద్యార్థికి ఎన్నికలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం వశిష్ట ఇంపాల్స్ ఈ టెక్నో స్కూల్లో విద్యార్థుల ఎన్నికలు నిర్వహించారు. పోటీలో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మల్ పట్టణ సర్కిల్ ఇన్స్పె్క్టర్ ప్రవీణ్ కుమార్ విచ్చేసి విద్యార్థులకు ఎన్నికలపై అవగహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ గొల్లపల్లి మాధవి, పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ దేవిదాస్ పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్, వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తికి నివాళులర్పించారు. క్రీడలు ఆడడం వలన శారీరక అభివృద్ధి మరియు మానసిక ప్రశాంతత లభిస్తుందని, జాతీయ క్రీడ అయిన హాకీని ప్రతి ఒక్కరు ఆడాలని విద్యార్థులకు సూచించారు. గిడుగు రామ్మూర్తి తెలుగు భాషకు చేసిన విశేష కృషిని వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన పిరమిడ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.