MoU of colleges: జగిత్యాల, డిసెంబర్ 24 (మన బలగం): విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల మధ్య మంగళవారం ఎంవోయూ కుదిరింది. మానవ వనరులను సద్వినియోగం చేయాలన్న లక్ష్యంతో రెండు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ రామకృష్ణ (జగిత్యాల), డాక్టర్ టీ.శ్రీనివాస్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు మారిన కాలానుగుణంగా వచ్చిన వృక్ష శాస్త్ర విభాగంలోని మార్పులు, నూతన సాంకేతిక ప్రక్రియలు మానవ వనరుల వినియోగం, విద్యార్థుల్లో నూతన నైపుణ్యాల పెంపుదల కోసం దోహదపడనుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ మాట్లాడుతూ ఎంవోయూ లింకేసులతోపాటు, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంతో బోధనా విధానంలో విప్లవాత్మక మార్పులకు ఆస్కారం ఉందని ఇరు కళాశాలల ప్రిన్సిపాల్స్ అభిప్రాయపడ్డారు.
ఎంవోయూ ఐదు సంవత్సరాల పాటు ఉంటుందని, దీనిని మరింత ప్రభావంతంగా సక్సెస్‌గా వినియోగించుకోవడంలో రెండు కళాశాలల వృక్ష శాస్త్ర విభాగాధిపతులు మరింత కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలకు చెందిన డాక్టర్ చంద్రయ్య, వృక్షశాస్త్ర సహాయ ఆచార్యురాలు డాక్టర్ డి.సుజాత, డాక్టర్ నరేశ్ ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల వృక్షశాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ పడాల తిరుపతి, స్పోర్ట్స్, గేమ్స్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీధర్ రావు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రమోద్ కుమార్, డాక్టర్ భౌతిక శాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ రామచంద్రం, రసాయన శాస్త్ర సహాయ ఆచార్యురాలు డాక్టర్ నీలి వాసవి, కళాశాల అధ్యాపకులు తదితరులు ఉన్నారు.