Selection to International Black Belt: ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 24 (మన బలగం): అంతర్జాతీయ బ్లాక్ బెల్ట్ పరీక్షకు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన అలకుంట్ల విశ్వంత్ ఎంపికయ్యారని జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్ మాస్టర్ తెలిపారు. జనవరి 18, 19, 20, 21, 22 తేదీలలో గచ్చిబౌలి స్టేడియం హైదరాబాద్‌లో జరగనున్న 50వ అంతర్జాతీయ బ్లాక్ బెల్ట్ పరీక్షలో విశ్వంత్ పాల్గొంటారని తెలిపారు. జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన శిక్షకులు రాపోలు సుదర్శన్, రాష్ర్ట టెక్నికల్ డైరెక్టర్ దయానంద్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జపాన్ దేశం నుంచి విచ్చేయనున్న నలుగురు మాస్టర్ల సమక్షంలో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. వివిధ దేశాలకు చెందిన కరాటే క్రీడాకారులు ఈ బ్లాక్ బెల్ట్ పరీక్షా, టోర్నమెంట్ పోటీలకు హాజరుకానున్నారు. బ్లాక్ బెల్ట్ పరీక్ష నిర్వహణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన శిక్షకులు రాపోలు సుదర్శన్, జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్, కరాటే మాస్టర్లు పవణ్ కళ్యాణ్, నవీన్ పాల్గొన్నారు.