Retired Army Jawan
Retired Army Jawan

Retired Army Jawan: రిటైర్డ్ ఆర్మీ జవానుకు సన్మానం

Retired Army Jawan: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ జర్నలిస్టు కాలనీకి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్‌ దుంపెట నరేందర్‌ను అతని మిత్రులు ఘనంగా సన్మానించారు. 22 సంవత్సరాలు దేశ రక్షణ సేవలో నిమగ్నం కావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నరేందర్ తెలిపారు. ఆర్మీలో చేరే యువతకు దిశానిర్దేశం చేసేందుకు ముందుంటానని ఈ సందర్భంగా వెల్లడించారు. 1998-99 పదో తరగతి బ్యాచ్ మిత్రులు నరేందర్‌ను ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మిత్రులు రమణ, నరేశ్, దినేశ్, దివాకర్, రాజేంద్రప్రసాద్, నర్సయ్య, రాజు వర్మ, శ్రీనివాస్ గౌడ్, వినాయక్, కిషన్, మహేశ్, సాజిద్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *