AIDS awareness: నిర్మల్, అక్టోబర్ 26 (మన బలగం): రోజు రోజుకూ విస్తరిస్తున్న హెచ్ఐవీ, ఎయిడ్స్‌ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పబ్లిక్ హెల్త్ నర్స్ దుర్గ భవాని, ఈజీఎస్ ఏపీవో దివ్య కోరారు. శనివారం దిలావర్‌పూర్ మండలం కాల్వ తండా, సిర్గాపూర్ గ్రామాల్లో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ దుర్గ భవాని, ఈజీఎస్ ఏపీవో దివ్య మాట్లాడుతూ, హెచ్ఐవీ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉంటేనే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా అవగాహన పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎం శోభ, షూర్ ఎన్జీవో పీఎం మల్లికార్జున్, జీఎన్ఎం సంగీత, పంచాయతీ కార్యదర్శులు నగేశ్, సౌమ్య, కౌన్సిలర్ గంగుల శ్రీనివాస్, ఆశాకార్యకర్త రాజమణి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.