BJP Mudhole: ముధోల్, నవంబర్ 15 (మన బలగం): ముధోల్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యశాల మండల అధ్యక్షుడు కోరిపోతన్న అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముధోల్ అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ సుమన్ కుమార్ పాల్గొని సంస్థాగత ఎన్నికల నియమావళి పోలింగ్ బూత్ కమిటీల అర్హత గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్ బూతుల వారీగా శక్తి కేంద్రాలుగా గుర్తించి సంస్థాగత ఎన్నికల శక్తి కేంద్ర సహయోగులను నియమించారన్నారు. మండలంలోని 35 పోలింగ్ బూత్‌లలో ఎన్ని పోలింగ్ బూత్‌లు అర్హత సాధించారో సమీక్ష చేసి మండల కమిటీలను ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయాలపై కార్యకర్తలకు సూచనలు అందించారని తెలిపారు. సమావేశంలో మండల అధ్యక్షుడు కోరి పోతన్న, ఎంపీటీసీ దేవోజి భూమేష్, సీనియర్ నాయకులు తాటివార్ రమేష్, సంస్థాగత ఎన్నికల ఇన్చార్జీలు భూమేష్ ఉమేష్, మోహన్ యాదవ్, బతినోళ్ల సాయన్న, జీవన్, గంగారెడ్డి, శ్రీనివాస్, నరేష్, బోరిగం నాయకులు నర్సింగరావు, బీజేవైఎం మండల అధ్యక్షుడు సాయి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.