White Ration Card: కొన్నేళ్లుగా తెల్ల రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులందరికీ రేషన్ కార్డులు అందించేందుకు ప్లాన్ చేస్తోంది. రాష్ర్ట మంత్రి వర్గ ఉప సంఘం సైతం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం త్వరలోనే రేషన్ కార్డులు జారీ చేయాలని నిశ్చయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారి వార్షిక ఆదాయం రూ.లక్షన్నర లోపు ఉండాలి. దీంతోపాటు మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు ఉన్నవారూ అర్హులుగా నిర్ధారించనున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో వారికి వారికి వార్షిక ఆదాయం రూ.2 లక్షలు మించరాదు. దీనిని ప్రామాణికంగా దీసుకొని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారు. లబ్ధిదారుల ఎంపికకు విధి విధానాల రూపకల్పనలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయనున్నారు.
లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యుల అభిప్రాయాలనూ తీసుకోనున్నారు. వాందరికీ సమాచారం చేరేలా లేఖలు రాయాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. తెల్ల రేషన్ కార్డుల జారీ కోసం సక్సేనా కమిటీ సిఫారసుల పరిశీలించనున్నారు. దేశంలోని ఇతర రాష్ర్టా్ల్లో తెల్ల రేషన్ కార్డుల అర్హత ప్రమాణాలను తెలుసుకోనున్నారు. ఇతర రాష్ర్టాల్లోనూ తెల్ల రేషన్ కార్డు ఉండి తెలంగాణలోనూ ఉంటే అలాంటి వారిని తొలగించనున్నారు. కార్డుల జారీలో అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకోనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేఖలు రాసి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. రెండు రాష్ర్టాల్లో రేషన్ కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులున్నాయి. 10 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.