Jagityal Collector: ఇబ్రహీంపట్నం, నవంబర్ 7 (మన బలగం): మార్కెట్‌కు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలోని గోధూర్, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది, ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత కొనుగోలు కేంద్ర నిర్వాహకులను కేంద్రం ఏ విధంగా నడుస్తుంది అని తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చెయ్యాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సర ఫరాల అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా మేనేజర్ పౌర సరఫరాల అధికారి జితేందర్, డీఆర్డీవో రఘు వరణ్, మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారి అకు రాజ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగాం రాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.