PM Suraksha Bima yojana: మల్యాల, డిసెంబర్ 20 (మన బలగం): కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న బీమా సౌకర్యాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంక్ ఎఫ్ఎల్సీ మధుసూదన్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకాలపై శుక్రవారం మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో జిల్లా లీడ్ బ్యాంక్ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ ఎఫ్ఎల్సీ కోట మధుసూదన్ మాట్లాడుతూ జిల్లాలోని 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండి, బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఖాతా కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బీమా నమోదు చేయించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి అర్హులైన వారందరికీ బీమా నమో చేసారు. రోజు రోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దని, వ్యక్తిగత వివరాలు వెల్లడించొద్దని సూచించారు. కార్యక్రమంలో సెర్ప్ సీసీ కృష్ణ మోహన్, వీవోఏ సుధ, బీసీ పాయింట్ నిర్వాహకులు గంగాధర్, వివిధ మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.