Jana Sena leader honored TTD member: జగిత్యాల, నవంబర్ 9 (మన బలగం):తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా నియమితులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనసేన ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డిని జగిత్యాల జనసేన నాయకులు బేక్కం జనార్దన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో కలిసిన జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి బేక్కం జనార్దన్ శాలువాతో సన్మానించి పుష్ప గుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్లేందుకు నిరంతరం కృషిచేసిన మీకు అందరి ఆశీర్వాదాలతో టీటీడీ బోర్డు మెంబర్‌గా ఎంపిక కావడం సంతోషకరమన్నారు. వేంకటేశ్వరుడి దీవెనలు అందరికీ చేరేలా కృషిచేయాలని జనార్దన్ కోరారు.