హోటల్ ఎదుట నిరసన.. కేసు నమోదు
Jerry in idly: జగిత్యాల, అక్టోబర్ 13 (మన బలగం): కుటుంబంతో సహా ఓ ఉడిపి హోటల్‌కు వెళ్లిన ఆ కుటుంబానికి నిరాశే ఎదురైంది. ఆశతో తమ పిల్లలకు ఇడ్లీ ఆర్డర్ పెట్టిన ఆ తల్లి అందులో జెర్రీ కనిపించడంతో ఆ హోటల్ యజమానిని నిలదీసి రోడ్డెక్కి ఆందోళనకు దిగిన సంఘటన ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జగిత్యాల పట్టణంలోని పురానిపేటకు చెందిన జయశ్రీ అనే మహిళ తన కొడుకు, కోడలు వారి పిల్లలతో కలిసి తహసీల్దార్ చౌరస్తాలోని గణేశ్ ఉడిపి హోటల్‌కు వెళ్లింది. పిల్లల కోసం ఇడ్లి తెప్పించగా అందులో జెర్రీ కనిపించింది. ఇదేమిటని హోటల్ నిర్వాహకుడిని మొదట నీలదియగా అది జెర్రీ కాదు, నల్ల దారం అని బుకాయించే ప్రయత్నం చేశాడు. బాధితులు, ఇతర కస్టమర్స్ జెర్రీ కాకుంటే తిని చూపించాలని నిలదీశారు.
దీంతో నోట్లో వేసుకొన్న ఆ హోటల్ నిర్వాహకుడు జెర్రీ అని గుర్తించి ఉమ్మేశి నోరు కడుక్కోనేందుకు సిద్ధమయ్యాడు. హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై మిగతా కస్టమర్స్ మండిపడగా ఇది తినివుంటే తమ పిల్లల పరిస్థితి ఏంటని ఆందోళనతో ఆ పిల్లల తల్లి, అమ్మమ్మ జయశ్రీ హోటల్ ముందు నిరసనకు దిగి హోటల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతలోనే అక్కడికి వచ్చిన చెత్త ట్రాక్టర్‌లో అన్ని ఇడ్లీలను పారేసేందుకు ప్రయత్నించగా కస్టమర్స్, జయశ్రీ, కొడుకు, కోడలు అడ్డుకొన్నారు. ఇంతలోనే బ్లూ కోర్టు పోలీసులు రావడం బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు పోగా మునిసిపల్ శానిటరీ సిబ్బంది వచ్చి హోటల్ షటర్స్ మూసేసి ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. గణేశ్ ఉడిపి హోటల్ ఇడ్లీల్లో జెర్రీ వచ్చిందన్న వార్త జగిత్యాల జిల్లాలోనే చర్చనీయంశంగా మారింది.
ధరలు ఎక్కువే.. నాణ్యత తెలిసిందే..
రోడ్డు మీది టిఫిన్ బండ్లపై దొరికే టిఫిన్ తినేందుకు చాలామంది ప్రజలు సందేహిస్తారు. దీనికి ప్రధాన కారణం నామోషీ ఒకటైతే, కొందరికి కూర్చొని ప్రశాంతంగా తినాలనే అభిలాష ఒకటి. వీటన్నటికి తోడు నాణ్యతపై అనుమానాలు. ఇలాంటి వన్నీ ఉడిపి హోటల్ యాజమాన్యాలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇలా వస్తున్న వినియోగదారులకు నాణ్యత పరమైన టిఫిన్స్ అందిస్తలేరనే అంశం ఆదివారం నాటి జెర్రీ సంఘటనతో వెలుగు చూసింది. కానీ ఉడిపి హోటల్‌లో ధరల మాట ఎక్కడ లేని రేట్లు ఉండడం విశేషం.
అయితే ఇప్పటి వరకు ఆ ఊడిపి హోటల్ వినియోగదారులు ఈ ధరలను చూస్తూ నాణ్యమైనవే ఇక్కడ దొరుకుతున్నాయన్న అపోహలో ఉండిపోయినట్లు కొందరు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ హోటల్ నిర్వాహకులకు ఇచ్చిన మెనూలో ఒక ఇడ్లి 75 గ్రాములకు తక్కువగా ఉందరాదన్న నిబంధన ఉన్నట్లు తెలిసింది. ఇలా ప్రతి ఐటమ్‌కు తీసుకునే ధరను బట్టి ఒక నిర్దేశిత బరువు, అందులోనూ చట్నీ ఇన్ని గ్రాములు ఇలా ప్రతి ఐటమ్స్‌కు ఒక నిర్దేశిత ప్రమాణాలను ప్రభుత్వం రూపొందించినట్లు సమాచారం. కానీ వినియోగదారులకు వాళ్ల చెల్లింపు ధరలకు సరిపడా టిఫిన్స్ అందిస్తున్నారా లేదా అనేది ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది పలువురి అభిప్రాయం.