Nirmal police bike rally: నిర్మల్, అక్టోబర్ 26 (మన బలగం): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవల్లో భాగంగా శనివారం నిర్మల్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ జానకి షర్మిల బైక్ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. బైక్ ర్యాలీ నిర్మల్ పట్టణంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని అమరవీరుల స్తూపం నుంచి ప్రారంభమై మంచిర్యాల ఎక్స్ రోడ్, ఎస్పీ క్యాంప్ కార్యాలయం, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా నుంచి తిరిగి అమరవీరుల స్తూపం వరకు సాగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజా రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ సైనికుల్లా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమన్నారు. ప్రజా క్షేమం కోసం పని చేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామని తెలిపారు. ,అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలతో మరింత మమేకం అవుతూ వారి మన్నలను పొందేలా విధులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వారి ఆశయ సాధన కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు.
ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్-రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల వాళ్ల జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తనవంతు బాధ్యత గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో అధికంగా తలకు గాయం కావడం వలన వాహనదారులు మరణిస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పని సరిగా ధరించి వాహనం నడపాలని ఎస్పీ కోరారు.
కార్యక్రమంలో ఎస్పీతో పాటు అవినాష్ కుమార్ ఐపీఎస్, సీఐలు గోపినాథ్, నైలు, నవీన్ కుమార్, ప్రవీణ్ కుమార్, ప్రేమ్ కుమార్, మల్లేశ్, రామ కృష్ణ, రవీందర్, ఆర్ఐలు రామ్ నిరంజ రావు, శేఖర్, రమేశ్, ఎస్ఐలు శ్రీనివాస్, శంకర్, అశోక్, గణేశ్, లింబాద్రి, రాహుల్, రమేశ్, భాస్కర్ చారి, సాగర్ రెడ్డి, సాయి కుమార్, రాజేశ్వర్ గౌడ్, హనుమాండ్లు, శ్రీకాంత్, సుమలత, జ్యోతి మని, సుమాంజలి, ఆర్ఎస్సైలు, వినోద్, రవి కుమార్, సాయి కృష్ణ, రాజా శేఖర్, ఎం.రవి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.