Harish Rao
Harish Rao

Harish Rao: పాదయాత్ర ట్రైలరే.. ముందుంది సినిమా

  • రైతులకు రేవంత్ చేసిందేమీలేదు.. మోసం తప్ప
  • బోనస్ దేవుడేరుగు.. వెయ్యి లాస్
  • రేవంత్‌ను నమ్ముకొంటే వడ్డీల పాలు
  • అసెంబ్లీ ఎన్నికల్లో బాండ్ పేపర్లు
  • లోక్‌సభకు దేవుళ్ల మీద ఓట్లు
  • మాజీ మంత్రి హరీశ్ రావు

Harish Rao: జగిత్యాల, నవంబర్ 12 (మన బలగం): అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను నిండాముంచాడని, హామీలను పక్కనపెట్టి ఇచ్చిన తేదీలలో రైతు రుణమాఫీ చేయక మోసపూరిత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రజల్లో నిలిచాడని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేపట్టిన కోరుట్ల టూ జగిత్యాల కలెక్టరెట్ పాదయాత్రకు హరీశ్ రావు హాజరై పాదయాత్రలో పాల్గొని జగిత్యాలలో మాట్లాడారు. కోరుట్ల యువ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహజంగానే వెన్నెముక వ్యాధి చికిత్సలో నిపుణులని హరీశ్ రావు అన్నారు. అలాంటి ఈ వైద్యుడు దేశానికి వెన్నెముక లాంటి రైతుల కష్టాన్ని చూసి 25 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. యువ ఎమ్మెల్యే సంజయ్ చేపట్టిన ఈ పాదయాత్ర రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం ట్రైలరే నని మునుముందు 70 ఎంఎం సినిమా చూపిస్తామని హరీశ్ రావు అన్నారు.

ఓట్లొస్తేనే రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తారని రైతుల కష్టాలను చూసి సంజయ్ పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని హరీశ్ రావు అన్నారు. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాటి నుంచి నేటి వరకు రైతులను మోసాగిస్తూనే వస్తున్నాడన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీపై తొలి సంతకమని ప్రకటించి రుణమాఫీ చేయక దాటవేస్తున్నాడన్నారు. అప్పుడు, ఇప్పుడు అంటూ లీకులిస్తూ చివరకు సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9 అంటూ కొత్త డ్రామాలకు తెరలేపాడని ఏద్దెవా చేశారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల కరెంట్‌ను ఇచ్చి సకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకై కమలాకర్ అన్నతోపాటు నన్ను ప్రతి రోజూ కేసీఆర్ ప్రశ్నిస్తుండేవరన్నారు. అలాగే కొన్న ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించే ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ ఆదేశించే వారని చెప్పారు. నేటి కాంగ్రెస్ పాలనలో రైతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాలికొదిలేసి గాలి మోటార్లలో చక్కర్లు కొడుతున్నారని అన్నారు.

ఎన్నికల హామీల్లో వరి ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని ఇప్పుడు రైతులు వెయ్యి రూపాయల తుట్టి కి వడ్లను అమ్ముకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి ఎన్నికల ప్రచారంలో సన్న వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చామని చెప్పుకొన్నాడని ఏద్దెవా చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మోసం చేసేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో బాండ్ పేపర్లు రాసిచ్చారని పార్లమెంటు ఎన్నికల్లో దేవుండ్లపై ఓట్లు పెట్టారన్నారు. జగిత్యాల చుట్టూ నలుగురు మహిమ గల దేవుండ్లు కొలువైనారని దక్షిణాన వెలిసిన కొండగట్టు అంజన్నపై ఒట్టుపెట్టిన నాయకులు ఎవరినైనా అంజన్న విడిచిపెడతాడా అని గుర్తు చేశారు. ఈ సిపాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తి చేస్తానని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అని నాతో ఛాలెంజ్ చేశాడని, ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలో ప్రజలే నిర్ణయించాలని అన్నారు. రుణమాఫీ పూర్తికాక బ్యాంకోళ్ల వడ్డీలు కట్టలేక, రేవంత్ రెడ్డిని నమ్ముకొని రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు.

రుణమాఫీ అవుతుందన్న ఆశతో బ్యాంకోళ్ల వడ్డీ కట్టెందుకు రైతులు అప్పుల పాలవుతూ, ఉన్న బంగారాన్ని అమ్ముకొంటున్నారని చెప్పారు. కేసీఆర్ ఎన్నికల హామీల్లో చెప్పకుండానే రైతులకు 72 వేల 815 కోట్ల రైతు బంధును రైతుల అకౌంట్లలో వేశారని అన్నారు. కరోనా కష్ట కాలంలోనూ రైతు బంధు ఆపలేదన్నారు. రైతు బంధు ఎదని రైతులు అడిగితే లేవంటారని అదే మూసి నది ప్రక్షాళన కోసం లక్ష యాభై వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపు 24 గంటల నిరంతర కరెంట్‌ను ఇచ్చిన కేసీఆర్ ప్రతి మండలంలో గోదాములు నిర్మించారని, వరద కాలువను కాళేశ్వరం నీళ్లతో రిజర్వాయర్‌ను చేశాడని, ఎరువులు ఇచ్చిండు ఎన్నో చేసిండని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమిచేశాడో చెప్పాలని, నాకైతే సీఎం చేసింది ఏమీలేదని, అయితే నిరుద్యోగులను నిండా ముంచాడని, విద్యార్థులను, ఉద్యోగులను గోసపెట్టడని, గురుకులాలను అధ్వానంగా మార్చాడని, రైతు బంధు ఎగొట్టిండని, బతుకమ్మ చీరెలు బందు చేసిండని, గొర్రె పిల్లలు, చాప పిల్లలు, కేసీఆర్ కిట్లు బంధు చేసి అన్ని వర్గాలకు అన్యాయం చేశాడన్నారు.

జగిత్యాల జిల్లాను చేసింది కేసీఆర్ అని మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి జగిత్యాలను అభివృద్ధి చేశాడన్నారు. ముఖ్య మంత్రికి ప్రజలపై, రైతులపై పాలనపై పట్టింపులేదని మూటలు మోసుడే పనిగా పెట్టుకొన్నాడని ప్రతి పక్ష బీఆర్ఎస్ నాయకులను బండ బూతులు తిడుతూ బూతు ముఖ్యమంత్రిగా ప్రజల్లో రేవంత్ రెడ్డి పేరుగాంచుతున్నాడని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాజేశం గౌడ్, ఎమ్మెల్సి రమణ, మాజీ జడ్పీ చైర్మన్లు దావ వసంత, తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ తోపాటు రవీందర్ రావు, దేశపతి శ్రీనివాస్, దేవి ప్రసాద్, లక్ష్మీనర్సింహా రావుతోపాటు నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *