Police Open House: నిర్మల్, డిసెంబర్ 7 (మన బలగం): ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా శనివారం నిర్మల్ పట్టణంలోని సోమవారపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్మల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వివిధ సందర్భాలలో ఉపయోగించే రివాల్వర్, రైఫిల్ 303, సెల్ఫ్ లోడ్ రైఫిల్, ఏకే 47, మిషన్ గన్లను ప్రదర్శించి వాటి పనితీరును విద్యార్థులకు వివరించారు. మెటల్ డిటెక్టర్ టీం, బాంబు నిర్వీర్య టీంలు ఆయా పరికరాల పనితీరును ప్రదర్శించారు. కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ ప్రభాకర్ పట్టణ సీఐ ప్రవీణ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముడారపు పరమేశ్వర్, ఉపాధ్యాయులు లతోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.