BJP: ఇబ్రహీంపట్నం, నవంబర్ 15 (మన బలగం): రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల బీజేపీ అధ్యక్షులు బాయి లింగారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మండల బీజేపీ ఇన్‌చార్జి తుకారాం గౌడ్ కార్యక్రమానికి హాజరయ్యారు. నూతనంగా బూత్ అధ్యక్షులను, శక్తి కేంద్ర ఇన్చార్జిలను ఎన్నుకునే ప్రక్రియ నిర్వహించుకోవాలని, అలాగే ప్రతి బూత్ అధ్యక్షులు తన కార్యవర్గం ఏర్పరచుకొని క్రియాశీల సభ్యత్వాలను త్వరలో నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు సుంచు రణధీర్, పంతంగి వెంకటేశ్ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీధర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా నాయకులు మహేశ్, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఉపాధ్యక్షలు తిరుమల చారి, కార్యదర్శులు సతీశ్, దేవన్న, శ్రీనివాస్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు గంగారెడ్డి, మనోజ్, బూత్ అధ్యక్షులు శేఖర్, శ్రీకాంత్, రాజేందర్, మల్లేష్, శేఖర్, రవి, శ్రీనివాస్, దేవీలాల్ నరేందర్, శక్తికేంద్ర ఇన్చార్జిలు ముద్ద నరేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.