Vaccinations for buffaloes: నిర్మల్, అక్టోబర్ 29 (మన బలగం): నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామంలో గేదెలకు, ఆవులకు, దూడలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత గాలికుంటు టీకాలను వెటర్నరీ వైద్యులు వేశారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గ్రామంలో 250 పశువులకు టీకాలు వేసినట్లు డాక్టర్ ఓం ప్రకాష్ తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది మధు, సోమేశ్, గ్రామ పశుపోషకులు పాల్గొన్నారు.