- అమెరికా చేతిలో ఘోర పరాభవం
- పాక్ ఫ్యాన్స్ ఆగ్రహం
PAKISTAN, T20 World Cup 2024: యూఎస్ఏ, జింబాబ్వే (Zimbabwe), ఐర్లాండ్ (Ireland), బంగ్లాదేశ్ (Bangladesh) లాంటి జట్లపై ఓడిపోయి పాకిస్థాన్ (Pakistan) జట్టు ఐసీసీ టోర్నీల్లో తమ పరువు పోగొట్టుకుంటుంది. 2022లో జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో జింబాబ్వేపై ఒక్క పరుగు తేడాతో ఓడిపోగా.. 2024 టీ20 వరల్డ్ కప్ గ్రూపు మ్యాచ్‌లో క్రికెట్‌లో పసికూన యూఎస్ఏపై ఓడిపోయి చెత్త రికార్డును తన పేరున లిఖించుకుంది. బంగ్లాదేశ్, జింబాబ్వే, యూఎస్ఏ (USA), అఫ్గానిస్తాన్ (Afghanistan) ఐర్లాండ్ లాంటి జట్లపై ఓడిపోయి తన ప్రాభవాన్ని కోల్పోతుంది. నెల రోజుల కిందట ఐర్లాండ్‌లో ఆతిథ్య దేశంతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి పరువు పోగొట్టుకుంది.
వన్డే వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్‌పై వన్డేల్లో ఓడిపోయి నిరాశతో ఇంటిముఖం పట్టింది. పాక్ ఓటమితో ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan), రషీద్ ఖాన్ (Rashid Khan) చేసిన డ్యాన్స్‌పై పాక్ అభిమానులు గుస్స అయ్యారు. ఐసీసీ టోర్నీల్లోన్నే కాకుండా ఇతర మ్యాచుల్లో ఓడిపోతూ.. ఒకప్పటి పాక్ టీంల కాకుండి గల్లీ టీంలాగా మారింది. భీకరమైన బౌలింగ్ ఉన్నా.. ఫామ్ కోల్పోవడంతో ఏమీ చేయలేకపోతుంది.
కొంపమునిగింది ఇక్కడే
యూఎస్ఏ మ్యాచ్‌లో పాక్ చెత్త ఫీల్డింగ్ వారి కొంప ముంచింది. స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన ఇఫ్తికార్ ఒక క్యాచ్ పట్టకుండానే వదిలేయగా.. మరో క్యాచ్‌ను కూడా వదిలేశాడు. ఉత్కంఠ భరితంగా మ్యాచ్ కొనసాగుతుండగా.. అమెరికా బ్యాటర్ ఆరోన్ జోన్స్ ఇచ్చిన క్యాచ్‌ను షాహీన్ ఆఫ్రిది డ్రాప్ చేశాడు. దీంతో అమెరికా బ్యాటర్ ఆరోన్ జోన్స్ చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను టైగా ముగించాడు.
సూపర్ ఓవర్‌లో అయిన పాక్ తీరు మారుతుందనుకుంటే మహమ్మద్ అమిర్ ఎక్స్ ట్రాలు, వైడ్‌ల రూపంలోనే 7 పరుగులు ఇచ్చి మొత్తం ఓవరాల్ 18 పరుగులు సమర్పించుకున్నాడు. పాక్ చివరకు ఆరు పరుగుల తేడాతో పసికూన లాంటి అమెరికా టీంపై ఓడిపోవడంతో పాక్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.