Pavan Kalyan, OG Movie: పవన్ కల్యాణ్ మరో పోస్టర్ హల్ చల్ చేస్తోంది. నిప్పులు కక్కే కుర్చీలో కూల్‌గా కూర్చున్న స్టిల్ నెట్టింట వైరల్‌గా మారింది. చేతిలో గడియారంతో పవన్ కొత్త లుక్స్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో ఓజీ కూడా ఉంది. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు.
ఓజీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌లో మూవీపై ఆశలు పెంచాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓజీ మూవీ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. సౌండ్ బాక్స్ ఫొటోను షేర్ చేశారు. తొందరలోనే ఓజీ ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్లు సమాచారం. సౌండ్‌కు బాక్సులు బద్దలవడం ఖాయం అని రాసి ఉంది. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పవన్ స్టార్ పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మూవీ రిలీజ్ డేట్ చెప్పాలంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు.