IPL 2O24 RCB
IPL 2O24 RCB

RCB, IPL 2024:ఆర్సీబీ ఎందుకిలా?

  • ఆర్సీబీ ఎందుకిలా  ?
  • వరుస ఓటములకు కారణాలేంటి?
  • ఐదు మ్యాచుల్లో గెలిచింది ఒక్కటే

RCB, IPL 2024: ఈ సారీ బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు కలిసి రావడంలేదు. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లోనే ఓటమి చవి చూసింది. రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచింది. ఆ తరువాత కోల్‌కతా, లక్నో, రాజస్థాన్‌లతో జరిగిన మ్యాచ్‌లలో వరుసా ఓటమి చవి చూసి హ్యాట్రిక్ పరాజయాలను నమోదు చేసుకుంది. లక్నోతో జరిగిన మ్యాచ్ ఆర్సీబీ టీమ్ ఆల్ అవుట్ అయింది. మొదటి మ్యాచ్‌లో చెన్నై బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై 4 వికెట్లతో ఆర్సీబీ విజయాన్ని నమోదు చేసింది. మూడో మ్యాచ్‌లో కోల్‌కతా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. నాలుగో మ్యాచ్‌లో లక్నో 28 పరుగుల తేడాతో విన్ అయ్యింది. ఐదో మ్యాచ్‌లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడిన ఆర్సీబీ పంజాబ్‌పై మాత్రమే గెలిచింది. ఆ తరువ హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది.

ఎందుకిలా?
ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లో మూడు సార్లు టాస్ గెలిచింది. రెండు సార్లు ఓడింది. టాస్ గెలిచినా ముందు బ్యాటింగ్ చేయాలా లేక ఫీల్డింగ్ తీసుకోవాల అన్న నిర్ణయం తీసుకోడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. ప్రతి మ్యాచ్‌టాప్ ఆర్డర్ రాణిస్తున్నా మిడిల్ ఆర్డర్ అనుకున్న స్థాయిలో రాణించడంలేదు. బౌలర్ల ప్రదర్శన సైతం అంతమాత్రంగానే ఉంది. సరైన సమయంలో వికెట్లు తీయకపోవడంతో ప్రత్యర్థి జట్లు భారీ భాగస్వామ్యాలు నమోదు చేసి అలవోకగా విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఐదో మ్యాచ్‌లో రాజస్థాన్‌లో తలపడిన ఆర్సీబీ బౌలర్లు వికెట్లు తీసేందుకు చెమటలు కక్కారు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు బట్లర్ -సంజు శాంసన్ 148 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో రాజస్థాన్ తేలికగా గెలువగలిగింది. భారీ భాగస్వామ్యాలు నెలకొల్పకపోవడం, మిడల్ ఆర్డర్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండడం, బౌలర్లు సరైన సమయంలో భాగస్వామ్యాలు విడదీయలేకపోవడం ఆర్సీబీ పరాజయాలకు కారణంగా తెలుస్తోంది.

ఆరంభ మ్యాచ్‌లో ఢమాల్
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభ మ్యాచ్ చెన్నై వేదికగా జరిగింది. మార్చి 22వ తేదీన జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 రన్స్ మాత్రమే చెయగలిగింది. కొహ్లీ 21(20), కెప్టెన్ డుప్లెసిస్ 35(23), పటిదార్ 0(3), మ్యాక్స్‌వెల్ 0(1), గ్రీన్ 18(22), అంజురావత్ 48(25), దినేశ్ కార్తిక్ 38(26) రన్స్ చేశారు. తరువా బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 15(15), రచిన్ రవీంద్ర 37(15), రహానే 27(19), డారెల్ మిచెల్ 22(18), శివం దూబే 34(28), రవీంద్ర జడేజా 25(17) రన్స్ చేశారు. చెన్నై 18.4 ఓవర్లలో 176 రన్స్ చేసింది. దీంతో బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో గెలిచింది.

పంజాబ్‌పై 4 వికెట్లతో విక్టరీ
మార్చి 25న బెంగళూరు వేదికగా 6వ మ్యాచ్ జరిగింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. కెప్టెన్ ధవన్ 45(37), బెయిర్‌స్టో 8(6), ప్రభ్ సిమ్రన్ 25(17), లివింగ్‌స్టోన్ 17(13), సామ్‌కర్రన్ 23(17), జితేశ్ శర్మ 27(20), శశాంక్ సింగ్ 21(8), హర్‌ప్రీత్ 2(2) రన్స్ చేశారు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాట్స్‌మెన్స్‌లో కొహ్లీ 77(49), కెప్టెన్ డుప్లెసిస్ 3(7), కామెరన్ గ్రీన్ 3(5), మ్యాక్స్‌వెల్ 3(5), అంజు రావత్ 11(14), దినేశ్ కార్తిక్ 28(10), మహిపాల్ 17(8) రన్స్ చేశారు. దీంతో ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 178 రన్స్ చేసి పంజాబ్‌పై 4 వికెట్లతో ఆర్సీబీ విజయాన్ని నమోదు చేసింది.

కోల్‌కతాపై ఏడు వికెట్ల తేడాతో ఓటమి
మార్చి 29వ తేదీన బెంగళూరు వేదికగా 10వ మ్యాచ్ జరిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాయల్ చాలెంజ్ బెంగళూరు తలపడింది. కోల్‌కతా టాస్ గెలిసి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కొహ్లీ 83(59), కెప్టెన్ డుప్లెసిస్ 8(6), గ్రీన్ 33(21), మాక్స్‌వెల్ 28(19), పటిదార్ 3(4), రావత్ 3(3), దినేశ్ కార్తిక్ 20(8) రన్స్ చేశారు. దీంతో ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ బ్యాట్స్‌మెన్లు ఫిలిప్ సాల్ట్ 30(20), సునిల్ నరేన్ 47(22), వెంకటేశ్ అయ్యర్ 50(30), శ్రేయస్ అయ్యర్ 39(24) నాటౌట్, రింకూ సింగ్ 5(5) నాటౌట్‌గా నిలిచారు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్ 16.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 186 రన్స్ చేసింది. ఆర్సీబీపై ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.

లక్నోపై 28 పరుగుల తేడాతో పరాజయం
ఈ నెల 2వ తేదీన 15వ మ్యాచ్ బెంగళూరు వేదికగా 15వ మ్యాచ్ జరిగింది. ఆర్సీబీ, ఎల్ఎస్‌జీ తలపడ్డాయి. టాస్ గెలిసి ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. డికాక్ 81(56), కెప్టెన్ రాహుల్ 20(14), పడిక్కల్ 6(11), స్టొయినిస్ 24(15), పూరన్ 40(21), బదోని 0(3) రన్స్ చేశారు. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.4 ఓవర్లలో ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కొహ్లీ 22(16), కెప్టెన్ డుప్లెసిస్ 19(13), పటిదార్ 29(21), గెలెన్ మాక్స్‌వెల్ 0(2), కామెరన్ గ్రీన్ 9(9), అనుజ్ రావత్ 11(21), మహిపాల్ 33(13), దినేశ్ కార్తిక్ 4(8), మమాంక్ దగర్ 3(6), సిరాజ్ 12(8) రన్స్ చేశారు. 153 పరుగులకు ఆర్సీబీ టీమ్ కుప్పకూలింది. దీంతో లక్నో 28 పరుగులతో విజయాన్ని నమోదు చేసుకుంది.

రాజస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో పరాజయం
ఈ నెల 6న 19వ మ్యాచ్ జైపూర్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. కొహ్లీ 113(72) (నాటౌట్), డెప్లెసిస్ 44(33), మాక్స్ వెల్ 1(3), సౌరవ్ చౌహాన్ 9(6), గ్రీన్ 5(6) (నాటౌట్) రన్స్ చేశారు. తరువాత బ్యాటింగ్‌కు దిగిన బ్యాట్స్‌మెన్స్‌లో జైస్వాల్ డకౌట్‌ అయ్యాడు. జోస్ బట్లర్ 100(58) నాటౌట్, కెప్టెన్ సంజూ సామ్‌సన్ 69(42), రియాన్ పరాగ్ 4(4), ధ్రువ్ జురెల్ 2(3), హిట్‌మేయర్ 11(6) రన్స్ చేశారు. 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 189 రన్స్ చేయడంతో ఆర్ఆర్ ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై విజయాన్ని నమోదు చేసింది. కొహ్లీ సెంచరీ చేసినా ఆర్సీబీకి కలిసి రాలేదు. ఆర్ఆర్ బ్యాటర్ బట్లర్ ధాటిగా ఆడి సెంచరీ నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఆర్సీబీ ఓటమికి కారణాలేంటో చెప్పిన డుప్లిసెస్
రాజస్థాన్ రాయల్స్‌పై ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడంపై కెప్టెన్ డుప్లెసిస్ స్పందించాడు. తమ జట్టు స్కోరు 190 నుంచి 195 మధ్య చేసి ఉంటే గెలిచే అవకాశాలు ఉండేవని తెలిపారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 72 బంతుల్లో (12 ఫోర్లు, 4 సిక్సర్ల) సాయంతో 113 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కొహ్లీకి ఐపీఎల్‌లో 8వ సెంచరీ ఇది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *