INDIA vs ZIMBABWE
INDIA vs ZIMBABWE

INDIA vs ZIMBABWE: జై యువ భారత్ జింబాబ్వేపై ఘన విజయం

  • 4-1 తేడాతో సిరీస్ కైవసం
  • సెంచరీతో చలరేగిన అభిషేక్ శర్మ
  • గైక్వాడ్ అర్ధ సెంచరీ.. రాణించిన రింకూ

INDIA vs ZIMBABWE: జింబాబ్వే గడ్డపై భారత్ యువ జట్టు అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఐదు టీ 20లో సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్నది. మొదటి మ్యాచ్‌లో ఓటమి తరువాత తేరుకున్న భారత ఆటగాళ్లు వరుసా మ్యాచులు గెలుస్తూ సిరీస్‌న సొంతం చేసుకున్నారు. జట్టు సభ్యుల సమష్టి రాణింపుతో టూర్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నది. చివరి మ్యాచ్‌లో 42 పరుగులతో విక్టరీ అందుకుంది.

జింబాబ్వే, ఇండియా చివరి ఐదో టీ-20 మ్యాచ్ ఆదివారం జరిగింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో జైస్వాల్ 12, శుభ్‌మన్ గిల్ 13, అభిషేక్ శర్మ 14, సంజూ సామ్‌సన్ 58, రియాన్ పరాగ్ 22, శివం దూబే 26, రింకూ సింగ్ 11, వాషింగ్‌టన్ సుందర్ 1 పరుగులు చేశారు. ముజారబానీ 2, రజా, నగరవ, బ్రాండన్ మావుట చెరో వికెట్ తీశారు.

168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 125 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వెస్లీ మాధేవేరే 0, తడివానాశే మారువి 27, బ్రియాన్ బెన్నెట్ 10, డియోన్ మైయర్స్ 34, సికందర్ రాజా (సి) 8, జోనాథన్ కాంప్‌బెల్ 4, క్లైవ్ మదాండే 1, ఫరాజ్ అక్రమ్ 27, బ్రాండన్ మావుట 4, ముజారబానీని 1, రిజర్డ్ నగరవ 0 పరుగులు చేశారు. ముఖేష్ కుమార్ 4, శివం దూబే 2, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, తుషార్ దేశ్ పాండే చెరో వికెట్ తీశారు. దీంతో భారత్ 42 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్నది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా శివం దూబే నిలువగా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వాషింగ్‌టన్ సుందర్ నిలిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *