Job Mela : మెగా జాబ్ మేళాకు జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి దాదాపు 3000 మంది యువతీ యువకులు తరలివచ్చారు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 1500 మంది ప్రాథమిక పరీక్షలకు ఎంపికయ్యారు. ఫైనల్ పరీక్ష, ఇంటర్వ్యూల అనంతరం దాదాపు 48 కంపెనీలు అన్నీ కలిసి 800 మందికి ఎంపిక చేయగా, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్, కంపెనీల ప్రతినిధులు నియామక పత్రాలు పంపిణీ చేసి, వారిని అభినందించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరింత రాణించాలని ఆకాంక్షించారు.