Jagityala SP: జగిత్యాల జిల్లాలో వివిధ గ్రామాల గుండా ప్రవహిస్తున్న గోదావరి తీర ప్రాంతాల్లో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. మంగళవారం వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి పరివాహక గ్రామాలైన చెగ్యామ్, పాశిగామ్, ముక్కారావుపేట్, కోటిలింగాల వద్ద గల పుష్కర ఘాట్లలో గోదావరిలోని వరద ప్రభావాన్ని ఎస్పీ పరిశీలించారు. గోదావరి నది పరివాహక ప్రాంత మండలాలైన ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్, బీర్పూర్, ధర్మపురి, వెల్గటూర్ నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు మెపడానికి, చేపలు పట్టడానికి వెళ్లకూడదని అన్నారు. రాన్నున మూడు రోజులూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అవసరమైతే తప్ప బయటకి రాకూడదని కోరారు. కల్వర్టు, బ్రిడ్జిలపై నుంచి నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని కోరారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రఘుచందర్, ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ ఉమా సాగర్ ఉన్నారు.