Jagityal MLA Sanjay: జగిత్యాల జిల్లాగా మారడంతో జగిత్యాల పట్టణం వేగంగా అభివృద్ధి చెందు తోందని, నిధులిచ్చి పట్టణ అభివృద్ధికి కృషిచేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. శనివారం మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్తోపాటు మాజీ మున్సిపల్ చైర్మన్లు మెట్ట బట్టి, గిరి నాగభూషణంతో కలిసి సీఎంను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలిశారు. జగిత్యాల జిల్లాగా ఏర్పాటు కావడంతో జగిత్యాల పట్టణం వేగం విస్తరిస్తూ అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణ, నియోజకవర్గంవర్గ అభివృద్ధి కోసం నిధులు అవసరమని, నిధులిచ్చి జగిత్యాల అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు.