ipl 2024 mi rohit

ROHIT SHARMA, IPL 2024: రోహిత్ వచ్చే సీజన్ ముంబైకి ఆడడం లేదా?

  • ఆకాశ్ అంబానీ కారులో వాంఖడే స్టేడియంకు వచ్చిన రోహిత్ శర్మ
  • బుజ్జగింపు కార్యక్రమమేనని పుకార్లు
  • రాబోయే సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడకపోవచ్చు
  • హార్దిక్‌ను నమ్ముకుని రోహిత్‌కు అవమానం
  • ఢిల్లీతో సంప్రదింపులు జరుపుతున్న హిట్ మ్యాన్ ?

ROHIT SHARMA, IPL 2024: ముంబై ఇండియన్స్ (MUMBAL INDIANS) కెప్టెన్ రోహిత్ శర్మ(ROHIT SHARMA)ను కెప్టెన్సీ నుంచి తొలగించాక ముంబై జట్టు యాజమాన్యంపై అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదేవిధంగా మొదటి మూడు మ్యాచుల్లో ఓడిపోవడంతో హార్దిక్ పాండ్యాపై, యాజమాన్యంపై గుర్రుగా ఉన్నారు. ముంబైకి రోహిత్ శర్మ ఐదు సార్లు ఐపీఎల్ కప్‌ను అందించాడు. 2013, 15, 17, 19, 20 సంవత్సరాల్లో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన ఘనత రోహిత్ శర్మకు సొంతం. అటువంటి రోహిత్ శర్మను టీం కెప్టెన్సీ నుంచి తొలగించడం వల్ల ముంబై ఇండియన్స్ ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నారు.

ఆకాశ్ కారులో స్టేడియానికి రోహిత్
ఎట్టకేలకు ముంబై మూడు పరాజయాల తర్వాత ఒక విజయం అందుకుంది. ముంబైలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో దాదాపు 30 పరుగుల తేడాతో విజయం సాధించి పరువు నిలబెట్టుకుంది. రాబోయే మ్యాచుల్లో మరిన్ని సాధించాలని కోరుకుంటున్నారు. అయితే ముంబై జట్టు ఓనర్ ఆకాశ్ అంబానీ రోహిత్ శర్మని తన కారులో స్టేడియానికి తీసుకురావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కెప్టెన్సీ పోయినా గౌరవం అలానే ఉందని ఇలా చేశారని కొంతమంది అనుకుంటున్నారు.

నెక్స్ట్ ఐపీఎల్ డౌటేనా?
అయితే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చే సీజన్‌లో ఢిల్లీ ఫ్రాంచైజీకి ఆడేందుకు మొగ్గు చూపుతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. అదే విధంగా ముంబైకి ఆడకూడదని నిర్ణయించుకున్నట్టు వివిధ కథనాలు వెలువరిస్తున్నాయి మరి ఐపీఎల్ 2025లో ముంబయి తరఫున రోహిత్ శర్మ ఉండకపోవచ్చనే రూమర్స్ ఎక్కువయ్యాయి.

ఫ్యాన్స్ తగ్గారా?
అదే జరిగితే ముంబయి ఇండియన్స్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో పాటు అయిదు సార్లు టైటిట్ అందించిన వ్యక్తిని ఇలాగేనా గౌరవించడం అని ఇప్పటికే పాలోవర్స్ తిట్టిపోస్తున్నారు. రాబోయే రోజుల్లో ముంబయి ఇండియన్స్ తరఫున రోహిత్ ఆడకున్నా అభిమానులు మాత్రం హిట్ మ్యాన్ ను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *