Poultry Farm: ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 9 (మన బలగం): ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా పేరటి కోళ్ల పెంపకానికి సహకారం ఉంటుందని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగాం రాజు అన్నారు. మండలంలోని కోమటి కొండాపూర్ గ్రామానికి చెందిన శ్రీ యోగేశ్వర గ్రామ సంఘ సభ్యురాలు కాంపెల్లి జలజకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా పెరటి కోళ్ల పెంపకానికి సంబంధించి మదర్ యూనిట్ మంజూరైంది. బుధవారం ఇబ్రహీంపట్నం మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగాం రాజు, ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ సాంబరి చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం కోళ్ల పెంపకం గురించి పలువురికి అవగాహన చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రాజును ఎంపీడీవోను మహిళా సమితి సభ్యులు శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో ఏపీఎం శంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గుమ్మల రమేశ్ మండల సమైక్య అధ్యక్షురాలు సునీత, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు సురేఖ, సీసీ సహేందర్, రాజశ్రీ, గ్రామ సంఘాల అధ్యక్షులు, గ్రామ సంఘ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.