Inspection of School of Minority Gurus: ముధోల్, అక్టోబర్ 29 (మన బలగం): భైంసా పట్టణంలోని తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలను మంగళవారం ఆర్ఎల్సీ అధికారి జ్యోతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకకుండా పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం 93% ఉండడంపై ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పెరిగిపోతున్న చలిపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.ఏ జబ్బర్, వైస్ ప్రిన్సిపాల్ గంధం సాయినాథ్, పాఠశాల కోఆర్డినేటర్ సయ్యద్ మినహాజ్, అధ్యాపకులు రాజేశ్, అజహారుద్దీన్, నర్సయ్య, పాఠశాల నర్సింగ్ ఆఫీసర్ చాతరాజు దీప్తి, తదితరులు ఉన్నారు.