Jagityala SP
Jagityala SP

Jagityala SP: భరోసా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ

Jagityala SP: జగిత్యాల, డిసెంబర్ 3 (మన బలగం): బాధిత మహిళలకు, పిల్లలకు భరోసా కేంద్రంతో అందించే సేవలతో పూర్తి స్థాయిలో భరోసా కల్పించాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని భరోసా సెంటర్‌ను సందర్శించి లైంగిక, భౌతిక దాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్‌లో అందించే న్యాయ సలహాలు, సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్య పరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళల వేధింపులపై నమోదు అవుతున్న కేసుల వివరాలు తదితర విషయాలు అడిగి తెలుసుకొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని మహిళలకు ఎలాంటి ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ పోలీస్ శాఖ రక్షణ కల్పిస్తున్నదని అన్నారు. మహిళలను, చిన్నపిల్లలను వేధిస్తే చర్యలు తప్పవు అన్నారు. లైంగిక దాడులకు గురైన బాధితులకు సత్వర సేవలు అందించాల్సిన బాధ్యత భరోసా కేంద్రంపై ఉందని, లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కల్పించడంతో పాటు వారికి పూర్తి సహాయ సహకారాలను అందించాలని కోరారు. జిల్లాలో ఎక్కడైనా పోక్సో, అత్యాచారం కేసులు జరిగిన వెంటనే సంబంధిత బాధితులను నేరుగా భరోసా సెంటర్‌కు సంబంధిత అధికారులు తీసుకొని రాగానే చట్ట ప్రకారం వారికి సహాయ సహకారాలను అందిస్తూ తగు సూచనలు, సలహాలు తక్షణమే అందించాలని భరోసా సిబ్బందికి ఎస్పీ సూచించారు. పోక్సో, అత్యాచార కేసుల్లో బాధితులకు త్వరగా నష్టపరిహారం ఇప్పించడానికి వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది కృషి చేయాలని కొరారు. భరోసా సెంటర్ అందించే సేవలపై జిల్లాలో విద్యార్థులకు, మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భరోసా సెంటర్ సిబ్బందికి ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీ రంజిత్ రెడ్డి, భరోసా సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *