arrest of ex-sarpanches: ఇబ్రహీంపట్నం, నవంబర్ 4 (మన బలగం): రాష్ట్ర సర్పంచుల ఫోరం ఇచ్చిన పిలుపుమేరకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్‌లో నిర్వహించే పోరుబాటకు తరలకుండా ఉండేందుకు సోమవారం ఉదయం ఇబ్రహీంపట్నం మండల తాజా మాజీ సర్పంచ్‌లను ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ రెస్ట్ చేసి పోలీసు స్టెషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వదిలేశారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచులు మాట్లాడుతూ తమ గ్రామాల్లో అప్పు చేసి మరీ అభివృద్ధి చేసామని, బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన సర్పంచులను అరెస్టు చేయడం సరికాదని, ప్రభుత్వం పెండింగ్ బకాయిలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో పీసు తిరుపతి రెడ్డి, సంఘం సాగర్, సున్నం సత్యం, కల్లెడ గంగాధర్, అసతి పెద్ద రాజం, కొప్పెల శ్రీనివాస్, సుద్దాల జగన్ తదితరులు ఉన్నారు.